హిమాలయాలకు వెళ్లనున్న రజనీకాంత్ !
Published on Mar 9, 2018 5:11 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ కు దైవ చింతన కొంత ఎక్కువే. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ధ్యానం చేయడం, ఆ ధ్యానం చేయడానికి ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లడం ఆయనకు అలవాటు. ఆ అలవాటులో భాగంగానే ఆయన ఈ ఏడాది హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు రేపు మార్చి 10న రజనీ హిమాలయాలకు బయలుదేరనున్నారు. పొలిటికల్ పార్టీ పాటించిన తర్వాత రజనీ హిమాలయాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన నటించిన ‘కాలా’ ఏప్రిల్ 27వ విడుదలవుతుండగా ‘2 పాయింట్ 0’ చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఉంది.

 
Like us on Facebook