వరల్డ్ వైడ్ “వేట్టయన్” లేటెస్ట్ వసూళ్లు..!

వరల్డ్ వైడ్ “వేట్టయన్” లేటెస్ట్ వసూళ్లు..!

Published on Oct 13, 2024 10:03 AM IST

vettaiyan

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మంజు వారియర్, రితిక సింగ్ అలాగే అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి అలాగే ఫహద్ ఫాజిల్ లాంటి విలక్షణ నటులు కలయికలో దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రమే “వేట్టయన్”. మరి తమిళ్ సహా తెలుగు ఇతర పాన్ ఇండియా భాషల్లో విడుదలకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ ని తెచ్చుకుంది.

అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకోగా ఇప్పుడు మరిన్ని స్క్రీన్స్ ని కూడా పెంచుకుంటున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇలా ఈ చిత్రం మొత్తం మూడు రోజుల రన్ ని వైడ్ గా కంప్లీట్ చేసుకోగా ఈ మూడు రోజుల్లో భారీ మొత్తం 150 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈ చిత్రం అందుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ వీకెండ్ తో 200 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ ట్రేడ్ చెబుతున్నారు. దీనితో ఈ చిత్రం జైలర్ తరహాలో కాకపోయినా దానికి దగ్గరలో బాగానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు.

తాజా వార్తలు