రజినీకాంత్ షూటింగ్లో అడుగుపెట్టేది అప్పుడేనట

Published on Feb 25, 2021 1:18 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా బృందంలోని సభ్యులకు కోవిడ్ సోకడం, రజినీ అస్వస్థతకు గురికావడంతో నిలిచిపోయింది. ఆ తర్వాత రజినీ రాజకీయ ఆరంగేట్రం మీద నెలకొన్న వివాదాల కారణంగా సినిమా మరింత ఆలస్యమవుతుందని అన్నారు.

అయితే చిత్ర బృందం మాత్రం నవంబర్ 24న దీపావళి కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించడంతో త్వరలోనే సినిమా రీస్టార్ట్ అవుతుందని తేలింది. అయితే అది తమిళనాడు ఎన్నికల తర్వాతే ఉంటుందని అనుకున్నారు అందరూ. కానీ తాజా సమాచారం మేరకు మార్చి 15 నుండి చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ వార్తలతో రజినీ అభిమానుల్లో పూర్వపు ఉత్సాహం కనిపిస్తోంది. రజినీ రాజకీయాల్లోకి రాకపోయినా సినిమాల్లో మాత్రం కొనసాగాల్సిందే అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :