కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

Published on Dec 3, 2020 11:30 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏళ్ల తరబడి కొనసాగుతున్న మీమాంసకు తెరదించుతూ డిసెంబర్ 31న తన పొలిటికల్ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరిలో పార్టీని లాంచ్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సినీ అభిమానులైతే ఆయన కొత్త చిత్రం ‘అన్నాత్తే’ సంగతేమిటని ఆరాతీస్తున్నారు. ఇన్నాళ్లు కోవిడ్ మూలాన షూటింగ్ రీస్టార్ట్ చేయలేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నారు. మరి సినిమా ఎప్పుడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమాను కూడ త్వరలోనే ముగిస్తానని రజినీ తెలిపారు. ఇప్పటికే సినిమా షూట్ 60 శాతం ముగిసింది. మిగిలిఉన్న 40 శాతం చిత్రీకరణను హైదరాబాద్లోని చేయనున్నారు. రజినీ ఆరోగ్యం దృష్ట్యా పూర్తిగా సురక్షితమైన వాతావరణంలో ఈ చిత్రీకరణ ఉండనుంది. మొత్తం షూట్ ఫిల్మ్ సిటీలోనే జరపనున్నారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More