
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇండియాతో పాటు జపాన్, ఇతర విదేశాలలో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత రజినీకాంత్ సినిమా విడుదలవుతుండడంతో యావత్ సూపర్ స్టార్ అభిమానులలో సందడి నెలకొంది. ఈ సినిమాపై అంచనాలు మిన్నంటాయి. మొదటి రోజు తొలి ఆట చూడడానికి ఎగబడ్డారు. విడుదల తర్వాత సినిమా పట్ల కొంత మిశ్రమ స్పందన లభించింది.
కొందరు వీరాభిమానులు మొదటి ఆట చూడడం కోసం జపాన్ నుండి ఇండియా తరలివచ్చారు. పైన ఫోటోలో ఉన్న జపనీయులు శుక్రవారం చెన్నైలో సినిమా చూశారు.
కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

