రజినీ ‘లింగా’ షూటింగ్ ని అడ్డుకున్న పర్యావరణవేత్తలు.!

రజినీ ‘లింగా’ షూటింగ్ ని అడ్డుకున్న పర్యావరణవేత్తలు.!

Published on Aug 29, 2014 3:55 AM IST

lingaa

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు చిక్కుల్లో పడుతూనే ఉంది. ఈ చిత్ర టీం తాజాగా మరో ఇబ్బందిలో ఇరుక్కోవడం వలన షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్ర తాజా షెడ్యూల్ కర్నాటకలోని శిమోఘ జిల్లాలో బాగా ఫేమస్ అయిన లింగనమక్కి డామ్ వద్ద షూటింగ్ జరుగుతోంది. కానీ ఆ డామ్ ని పొల్యూట్ చేస్తున్నారని కమీషనర్ కి కంప్లైట్ వెళ్ళడంతో షూటింగ్ ఆగిపోయింది.

అసలు విషయంలోకి వెళితే .. లింగనమక్కి డామ్ వద్ద షూటింగ్ జరుగుతున్న టైములో ఈ చిత్ర టీం డామ్ సురక్షితంగా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు వాడిన ప్లాస్టిక్, ఇతర చెత్త చెదారాలతో పొల్యూట్ చేస్తున్నారని అక్కడి పర్యావరణవేత్తలు డిప్యూటీ కమీషనర్ కి కంప్లైట్ ఇవ్వడంతో షూటింగ్ ని వెంటనే ఆపేశారు.

ఇలా ఆపేయడం వల్ల ప్రొడక్షన్ పరంగా నిర్మాతకి చాలా నష్టం తేవడమే కాకుండా నటీనటుల షెడ్యూల్స్ కూడా ఇబ్బందిలో పడతాయని ప్రొడక్షన్ టీం వాపోతున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తన క్లోజ్ ఫ్రెండ్ మరియు మినిస్టర్ అయిన అంబరీష్ ద్వారా ఈ విషయాన్నీ పరిష్కరించాలని చూస్తున్నాడు.

తాజా వార్తలు