పెద్ద కుమార్తెకు కూడా రజినీకాంత్ అవకాశం ఇవ్వనున్నాడా.?

పెద్ద కుమార్తెకు కూడా రజినీకాంత్ అవకాశం ఇవ్వనున్నాడా.?

Published on Aug 26, 2014 12:43 AM IST

Rajinikanth copy
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ యన సినిమాలకు ఒక్క ఇండియాలోనే కాకుండా జపాన్ తదితర నగరాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. రజినీకాంత్ ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘లింగా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత రజినీ చేయనున్న సినిమాపై పలు వార్తలు, పలు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా కోలీవుడ్ లో రజినీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య రజినీకాంత్ పేరు వినిపిస్తోంది. ‘3’ సినిమాతో దర్శకురాలిగా మారిన ఐశ్వర్య ప్రస్తుతం ‘వాయ్ రాజా వాయ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా చూసిన రజినీకాంత్ ఐశ్వర్య టాలెంట్ కి మరింత ఇంప్రెస్ అయ్యాడట. దాంతో తన తదుపరి సినిమా ఐశ్వర్యతో మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో ‘కొచ్చాడియాన్’ సినిమాతో రజినీకాంత్ తన చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ కి అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తన పెద్ద కుమార్తె ఐశ్వర్యకి కూడా అవకాశం ఇస్తాడేమో చూడాలి..

తాజా వార్తలు