మొదటి రోజు చెన్నైలో రజనీ భీభత్సం

Published on Jan 10, 2020 10:10 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం నిన్న భారీ అంచానల నడుమ విడుదలైంది. అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం చెన్నై సిటీలో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టుకుంది. ట్రెడ్ వర్గాల సమాచారం మేరకు చెన్నై సిటీలో నిన్న రూ.2.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. పైగా నిన్న సెలవు రోజు కూడా కాదు. వర్కింగ్ డే రోజునే వసూళ్లు ఇలా ఉంటే అదే సెలవు రోజునో లేకపోతే వీకెండ్ రోజునో రిలీజ్ అయితే ఇంకా భారీ సంఖ్యలు నమోదయ్యేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓపెనింగ్స్ పరంగా ఈ చిత్రం ఆల్ టైమ్ నెంబర్ 3 స్థానంలో నిలబడగా మొదటి స్థానంలో రజనీ యొక్క ‘2 పాయింట్ 0’, రెండో స్థానంలో విజయ్ నటించిన ‘సర్కార్’ ఉన్నాయి. ఇక ఈ వారంతంలో భారీ సినిమాలేవీ లేవు కాబట్టి వసూళ్లు స్టడీగానే కొనసాగనున్నాయి. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం :