మెగాస్టార్ ‘సైరా’లో రజనీ హీరోయిన్ ?

మెగాస్టార్ ‘సైరా’లో రజనీ హీరోయిన్ ?

Published on Jun 25, 2018 4:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ఇప్పటికే నయనతార ప్రధాన కథానాయకిగా, తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి, ఇటీవలే రజనీకాంత్ యొక్క ‘కాలా’ చిత్రంలో నటించి పాపులర్ అయిన హుమా ఖురేషి. కథలోని ఒక కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించారట టీమ్.

అయితే చిత్ర టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తను పూర్తిగా నిజమని అనుకోలేం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటిస్తున్నారు.

తొలిసారి చిరంజీవి ఇలాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు