డార్జిలింగ్లో మొదలైన రజనీ సినిమా !
Published on Jun 7, 2018 3:05 pm IST

ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే రోజున రజనీ తన కొత్త సినిమా యొక్క చిత్రీకరణను కూడ మొదలుపెట్టారు. డార్జిలింగ్లో ఈ షూట్ మొదలైంది. యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

భిన్నమైన కథాంశాలతో, మంచి డ్రామా, పాత్రలతో సినిమాలు చేస్తూ విజన్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తిక్ సుబ్బరాజ్ మొదటిసారి రజనీతో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ సంగీత దర్శకత్వం వహించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook