విపరీతంగా వైరల్ అవుతున్న రాజమౌళి ఫొటో

Published on Aug 28, 2019 8:40 am IST

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిన్న బల్గెరియాలో ప్రారంభమైనది. రాజమౌళి ఎన్టీఆర్ పై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూలులో చిత్రీకరించనున్నాడని సమాచారం. దాదాపు ఒక నెలరోజు వరకు అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్ బల్గెరియాలో షూటింగ్ సెట్ లో రాజమౌళి ఫోటో తీసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, తుఫాన్ కి ముందు ప్రశాంత లాంటి మనిషి(ది మాన్ బిఫోర్ స్ట్రోమ్) అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.

ఆ ఫొటోలో రాజమౌళి గన్ ని పోలిని ఓ కర్ర పుల్లని పట్టుకొని ఏదో సన్నివేశం కోసం తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది.బహుశా బల్గెరియా షెడ్యూల్లో ఎన్టీఆర్ పై తెరకెక్కించే యాక్షన్ సన్నివేశం కోసం ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మాధ్యమాలలతో విపరీతంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :