
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇటీవలే యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో రజినీకాంత్ – అనుష్కలపై ఓ పాటని షూట్ చేసారు. ఇంకా ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ బాలన్స్ ఉన్నాయి. అందులో ఒక పాటని నేటి నుంచి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రజినీకాంత్ – సోనాక్షి సిన్హాలపై ఓ పాటని షూట్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ని వేసారు.
సోనాక్షి సిన్హా కూడా హైదరాబాద్ చేరుకోవడంతో ఈ రోజు ఉదయం ఈ సాంగ్ షూటింగ్ ప్రాంభించారు. ఈ సాంగ్ షూటింగ్ అయ్యాక అబ్రాడ్ లో రజినీకాంత్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. రజినీ కాంత్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర ప్రస్తుతానికి చెందినది అయితే మరొకటి 1947 కాలానికి చెందింది.
కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. రజినీకాంత్ బిరత్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.