యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారి తెరకెక్కిస్తుండగా ఈ చిత్రాన్ని 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఘనంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే నవీన్, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా సినిమాలోని టైటిల్ సాంగ్ ‘రాజు గారి పెళ్లి రో‘ (Raju Gari Pelli Ro)ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ వేడుకలో నవీన్ పోలిశెట్టి ఎంతో ఉత్సాహంగా కనిపించగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పెప్పీ అండ్ పార్టీ బీట్స్‌కు అనుగుణంగా నవీన్, మీనాక్షి వేసిన డ్యాన్స్ మూమెంట్స్ యువతను విశేషంగా అలరిస్తున్నాయి.
చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించిన ఈ పెళ్లి పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో జోష్‌తో పాడారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. కలర్‌ఫుల్ వెడ్డింగ్ వైబ్స్‌తో సాగే ఈ పాట సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
