ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చి ఒక సర్ప్రైజింగ్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ ని కొట్టిన సినిమా “రాజు వెడ్స్ రాంబాయి” కూడా ఒకటి. యువ హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు లు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయిలు కంపాటి (బోస్) తెరకెక్కించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమ కథ యువతని ఇంప్రెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమాని ఈటీవీ విన్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఈ సినిమా వచ్చే వారం డిసెంబర్ 18 నుంచి రానుంది అని కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఉంటే ఇంకొన్ని రోజుల్లో ఈటీవీ విన్ లో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బలి బ్లాక్ బస్టర్ సంగీతం అందించగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు నిర్మాణం వహించారు.



