భారీ వ్యూస్ సొంతం చేసుకున్న “రాఖీ విత్ భోళా శంకర్”

Published on Aug 22, 2021 11:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నేడు భోళా శంకర్ చిత్రం నుండి వీడియో రాఖీ విత్ భోళా శంకర్ పేరిట ఒక వీడియో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం, మరొక పక్క రాఖీ పండుగ కావడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కేవలం పది గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

ఇప్పటి వరకూ ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ కి పైగా వ్యూస్ సాధించగా, యూ ట్యూబ్ లో 2.4 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 204కే లైక్స్ ను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రం లో మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ చిత్రం లో సోదరి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుస చిత్రాల అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ సైతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం :