శరవేగంతో “రాక్షసుడు” నిర్మాణాంతర కార్యక్రమాలు

Published on Jun 23, 2019 1:00 am IST

బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రాక్ష‌సుడు`. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.గత సంవత్సరం తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని నమోదు చేసిన “రాత్ససన్” మూవీకి తెలుగు రీమేక్ గా ఈ మూవీ చేయడం జరిగింది. స్కూల్స్ వెళ్లే టీనేజ్ అమ్మాయిలు టార్గెట్ గా వారిని కిడ్నాప్ చేసి,అతి క్రూరంగా హింసించి చంపే సైకో కిల్లర్ ని పరిశోధించి పట్టుకొనే పోలీస్ కథగా, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా విడుద‌ల చేస్తున్నారు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.

సంబంధిత సమాచారం :

More