
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన కెరీర్లోనే ఇది వరకూ కనిపించని మోస్ట్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తూ చేస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాన్నకు ప్రేమతో’. చూడటానికి టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం ఎన్.టి.ఆర్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా సుకుమార్ కథని సిద్దం చేసినట్లు సమాచారం. గత 15 రోజులుగా ఈ చిత్ర టీం స్పెయిన్ లో షూటింగ్ చేస్తోంది. గత మూడు రోజులుగా శోభి మాస్టర్ నేతృత్వంలో ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం నిన్నటితో ఈ చిత్ర టీం సాంగ్ షూట్ ని ఫినిష్ చేసారు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ స్పెయిన్ షెడ్యూల్ లో తన పార్ట్ ని పూర్తి చేసుకోవడంతో, నాన్నకు ప్రేమతోకి పాకప్ చెప్పి హైదరబాద్ ఫ్లైట్ ఎక్కేసింది. ఈ చిత్ర టీం మాత్రం మరో రెండు రోజులు మిగిలి ఉన్న సీన్స్ ని ఫినిష్ చేసుకొని రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ బయలు దేరనున్నారు. హైదరాబాద్ లో బాలన్స్ ఉన్న సాంగ్స్ ని షూట్ చేయనున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

