ఎప్పుడూ బిజీగా ఉండాలనుకుంటాను – రాకుల్ ప్రీత్

ఎప్పుడూ బిజీగా ఉండాలనుకుంటాను – రాకుల్ ప్రీత్

Published on Jun 1, 2014 5:25 PM IST

Rakul-Preet
రాకుల్ ప్రీత్ సింగ్, ఈ యువ నటి ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. చాలా సినిమాలలో నటిస్తున్న ఆమె, తన ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి నిరంతరం శ్రమిస్తుంది. సాధారణంగా ఇలా ఖాలీ లేకుండా పనిచేసే హీరొయిన్ లు అలసిపోతారు, కానీ రాకుల్ ప్రీత్ అలా కాదు. తనకు ఎప్పుడూ బిజీగా ఉండడం ఇష్టం అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయంపై తను మాట్లాడుతూ, ‘నా పనిని, నా బిజీ షెడ్యూల్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను’. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి పేరు వచ్చిన రాకుల్ ప్రీత్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. యువ హీరోల సరసన నటించడానికి చాలా అవకాశాలు వస్తున్నాయి. సినిమాలపై ఇదే ఇష్టం, పట్టుదలతో పని చేస్తే, తను ఒక పెద్ద స్టార్ అవడం ఖాయం.

ప్రస్తుతం రాకుల్ గోపీచంద్, మంచు మనోజ్, రామ్ తదితర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.

తాజా వార్తలు