ఎన్‌జీకే ఫెయిల్యూర్‌ను లైట్ తీసుకున్న రకుల్

ఎన్‌జీకే ఫెయిల్యూర్‌ను లైట్ తీసుకున్న రకుల్

Published on Jun 10, 2019 3:32 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు చేసి చాలాకాలమే అయింది. 2017లో వచ్చిన ‘స్పైడర్’ తర్వాత ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా ఏదీ చేయలేదు రకుల్. కారణం హిందీలో ఆమె ఒప్పుకున్న ‘దే దే ప్యార్ దే’ చిత్రం. ఈ సినిమా కోసం పలు తెలుగు సినిమాలను కూడా వద్దనుకున్నానని రకుల్ చెబుతోంది. అంతేకాదు ఆ సినిమా విజయం చాలా అనందాన్ని ఇచ్చిందని అంటోంది.

అజయ్ దేవగన్, టబు, ఇతర బడా స్టార్లు ఉన్నప్పటికీ తన నటన అందరికీ రిజిస్టర్ అయిందని, తన ఏడాది కష్టానికి ఫలితం దక్కిందని ఆనందపడుతున్న రకుల్ తన దృష్టిలో సక్సెస్ అంటే సంతోషంగా ఉండటమేనని, చేసే పని పట్ల చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉన్నానని అంది. ‘ఎన్‌జీకే’ తెలుగు, తమిళంలో రెండు భాషల్లో పెద్దగా మెప్పించలేకపోవడాన్ని ప్రస్తావిస్తూ సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి జర్నీలో భాగమంటూ పరాజయాన్ని లైట్ తీసుకుంది. ప్రస్తుతం ఈమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున సరసన ‘మన్మథుడు 2’లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు