‘రఫ్’గా డాన్స్ ఇరగదీశాను – రకుల్ ప్రీత్ సింగ్

‘రఫ్’గా డాన్స్ ఇరగదీశాను – రకుల్ ప్రీత్ సింగ్

Published on Sep 5, 2014 8:10 PM IST

Rakul-Preet-Singh
యంగ్ హీరో ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రఫ్’. సిహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సినిమాలో చివరి పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ ఒక రేంజ్లో చేసిందట.

‘రఫ్’లో ఒక పాట కోసం సాలిడ్ డాన్స్ చేస్తున్నాను. స్టెప్స్ చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు నేను మాక్సిమం డాన్స్ చేసింది ఈ పాట కోసమే. ఐ లవ్ దిస్ సాంగ్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.

తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రవిబాబు, జయప్రకాశ్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అభిలాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు