‘కొండపొలం’ నుండి రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ లుక్ !

Published on Aug 23, 2021 9:17 am IST


మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి రకుల్ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ముందే అనుకున్నట్లుగానే రకుల్ పూర్తి గ్రామీణ యువతిగానే కనిపించింది.

ఈ చిత్రం అయితే పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. కథ చాలా సహజంగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :