
మాస్ మహారాజ్ రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘కిక్ 2’. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా, సిటీ గర్ల్ గా రెండు పాత్రలలో కనిపిస్తాను. అంత కంటే నా క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేను. అని చెప్పింది. అలాగని డ్యూయల్ రోల్ కాదని స్పష్టం చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జైసల్మీర్ లో జరుగుతుంది.
‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’ సినిమాలతో గత ఏడాది మంచి విజయాలు అందుకున్న రకుల్ ప్రీత్, ఈ ఏడాది ‘కిక్ 2’, ‘పండగ చేస్కో’, సుకుమార్ – ఎన్టీఆర్ సినిమాలతో సందడి చేయడానికి సిద్దమయింది. అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చిన రకుల్.. తన నటనతో, అందంతో ప్రేక్షకుల మదిని దోచుకుంది.

