
మాస్ మహారాజ్ రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘కిక్ 2’. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా, సిటీ గర్ల్ గా రెండు పాత్రలలో కనిపిస్తాను. అంత కంటే నా క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయలేను. పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించింది. దర్శకుడు నా పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ‘కరెంట్ తీగ’ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయిగా నటించాను. కానీ, ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.
రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమా షూటింగును ఫినిష్ చేసింది. ఇటివల రాజస్తాన్, జైసల్మీర్ లో జరిగిన షెడ్యూల్ తో రకుల్ ప్రీత్ తన క్యారెక్టర్ షూటింగ్ కంప్లీట్ చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

