స్లమ్ ప్రజలకి భోజనం అందిస్తున్న స్టార్ హీరోయిన్

Published on Apr 5, 2020 5:21 pm IST

కరోనా లాక్ డౌన్ కారణంగా అనేక మంది పేదవారు, రోజూ వారి కూలీలు ఇక్కట్లు పడుతున్న వేళ వ్యాపారవేత్తలు, చిత్ర ప్రముఖులు, సామాజిక వేత్తలు ఆర్ధికంగా, మరియు సామాజికంగా వారికి అండగా నిలబడుతున్నారు. కాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ తన వంతు బాధ్యతగా ఓ కార్యక్రమం చేస్తున్నారు. గుర్గావ్ నందు కల ఓ స్లమ్ లో ప్రజలు నిత్యావసర సరుకు కొనలేక ఇబ్బంది పడుతున్నారట. వీరికి లాక్ డౌన్ వరకు రెండు పూటలా భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారట. ఒక వేళ లాక్ డౌన్ పొడిగిస్తే అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించునుకున్నారట.

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రకుల్ దాదాపు అందరు టాప్ స్టార్స్ తో నటించింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ అక్కడ వరుసగా చిత్రాలు చేస్తుంది. గత ఏడాది ఆమె అజయ్ దేవ్ గణ్ హీరోగా వచ్చిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్యార్ దే ప్యార్ దే చిత్రంలో నటించింది. ఆ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో రకుల్ కి అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగులో నితిన్ కి జంటగా ఓ చిత్రంలో ఈమె నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More