
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్, అతి కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. లౌక్యమ్ హిట్ తర్వాత కిక్ 2, పండగ చేస్కో, రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా, ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా, మహేష్ బ్రహ్మోత్సవం ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాల్లో కిక్ 2, పండగ చేస్కో సినిమాల షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో పండగ చేస్కో, కిక్ 2లు సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమయ్యాయ్.
ఈ నెల్లోనే రామ్ హీరోగా, గోపీచంద్ మలినేని తెరకెక్కించిన పండగ చేస్కో విడుదల కానుంది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. “పండగ చేస్కో సినిమాలో నేను ఓ పర్యావరణ వేత్తగా కనిపిస్తా. చెట్లు, వాటి సంరక్షణ వంటి విషయాల్లో పోరాడే పాత్రలో నటించడం కొత్తగా ఉండేది. ఆ పాత్ర చేసే చేష్టల ద్వారా కామెడీకి చాలా అవకాశం కూడా ఉండడంతో నా పాత్ర అందరినీ నవ్విస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది రకుల్. ఇప్పటికే విడుదలైన పండగ చేస్కో ట్రైలర్, ఆడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలాఖర్లో సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

