గోల్డెన్ లెగ్ అనకండి : రకుల్

గోల్డెన్ లెగ్ అనకండి : రకుల్

Published on Jul 8, 2015 8:03 AM IST

Rakul-Preet-Singh
చేసిన ప్రతీ సినిమా విజయం సాధిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సంతరించుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అయితే ఈ భామది గోల్డెన్ లెగ్ అని, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయాలేనని, అందుకే బడా హీరోలు సైతం ఈమె వెనుక పడుతున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తనదైన శైలిలో రకుల్ స్పందించింది.

నన్ను గోల్డెన్ లెగ్ అని మాత్రం పిలవద్దు ప్లీజ్ అని గారాలు పోయింది. సినిమాలు విజయవంతమైనంత మాత్రాన గోల్డెన్ లెగ్ అని, పరాజయం పాలైతే ఐరన్ లెగ్ అని కితాబివ్వడం తగదంటూ ఉపొధ్గాతమిచ్చింది. అంతేకాక తనకి ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ రాలేదని, తొలివిజయం కోసం ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు