రామ్ -పూరి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

Published on Jan 2, 2019 4:20 pm IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించనున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రేపు సాయంత్రం 4గంటలకు విడుదలచేయనున్నారు. మొదటి సారి వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అప్పుడే సినిమాకి కావాల్సిన హైప్ వస్తుంది. ఇక వరుస పరాజయాల తరువాత పూరి ఈచిత్రం తో మళ్ళీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ కావాలని భావిస్తుండగా ఎప్పటినుండో బ్లాక్ బ్లాస్టర్ విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈ చిత్రం తో అలాంటి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు.

యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈచిత్రం ఈనెలలో సెట్స్ మీదకు వెళ్లనుండగా ఈచిత్రంలో కథానాయిక పాత్ర కోసం కొత్త వారిని తీసుకుంటున్నారు. పూరి టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది మే లో విడుదలకానుంది. ఇక ఇప్పటివరకు ఛార్మి -పూరి సంయుక్తంగా రెండు చిత్రాలు నిర్మించగా అ రెండు కూడా నిరాశపరిచాయి. మరి ఈ చిత్రం అయినా వారికీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More