రామ్-బోయపాటి మూవీలో హీరోయిన్‌గా రష్మిక?

Published on Mar 16, 2022 2:08 am IST

ఎనర్జిటిక్ స్టార్ రాం పోతినేని మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తీయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు రష్మిక మందన్నని తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే దీనికి సంబంధిచి రష్మికతో చిత్ర బృందం చర్చలు కూడా జరిపిందని సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :