చరణ్‌ను కూడ ‘ఉప్పెన’ తాకింది

Published on Jan 15, 2021 8:05 pm IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. చాలారోజుల క్రితమే అన్ని పనులు ముగించుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ ఎఫెక్ట్ మూలంగా ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడంతో విడుదల సన్నాహాలు మొదలుపెట్టారు టీమ్. ఇందులో భాగంగానే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

భావోద్వేగపూరితమైన మాటలు, మంచి సంగీతం, ఆకట్టుకునే విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఇది ఫీడ్ గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని కలిగించాయి. చాలామంది టీజర్ అందంగా అనిపించిందని పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. టీజర్ చాలా అందంగా ఉందని, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ తాజాగా ఉందని అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ రకమైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో విడుదల ఆలస్యమైందనే నిరుత్సాహం నుండి బయటికొచ్చేశారు చిత్ర బృందం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :