అసాధారణమైన నటుడిగా రామ్ చరణ్ !

Published on Jan 2, 2019 4:00 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. నటన పరంగా కెరీర్ మొదట్లో అనేక విమర్శలు ఎదురుకున్న మాట వాస్తవం. ఇలాంటి తరుణంలోనే తాను హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తనలోని అసాధారణమైన నటుడ్ని చూపించాడు చరణ్.

చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ప్రేక్షకుల ఆశ్చర్యపరిచడమే కాక, తన నటనతో ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకున్నాడు. ఒక విధంగా 2018 సంవత్సరం రామ్ చరణ్ కెరీర్ లోనే అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం మాస్ డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన ప్రోమోలు చూస్తుంటే.. చరణ్ మళ్లీ రంగస్థలం సినిమాలో ఎంత వైవిధ్యంగా నటించాడో.. ఈ సినిమాలో అంతటి మాస్ క్యారెక్టర్ లో నటించాడని అనిపిస్తోంది. ఇక ఇటీవలే విడుదలైన స్పెషల్ సాంగ్ ప్రోమోలో కూడా చరణ్ డాన్స్ మూమెంట్స్ నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి చరణ్ ‘వినయ విధేయ రామ’లో కూడా తనలోని అసాధారణమైన నటుడ్ని మరోసారి చూపించనున్నాడన్నమాట.

సంబంధిత సమాచారం :