ఒకే వేదికపై కనిపించనున్న బన్నీ, రామ్ చరణ్ !
Published on Apr 24, 2018 11:53 am IST

అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అను ఇమ్మాన్యుయేల్ బన్నీకి జోడిగా నటించింది. ఇటీవలే ఈ చిత్ర ఆడియో వేడుక మిలిట్రీ మాధవరంలో ఘనంగా జరిగింది.

త్వరలోనే చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కూడ జరగనుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరుకానున్నారు. ఇటీవలే చరణ్ ‘రంగస్థలం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా చరణ్, బన్నీలు చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించనుండటం మెగా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

 
Like us on Facebook