మార్చ్ లో మోత.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ తో చరణ్ బర్త్ డే మంత్ రచ్చ రచ్చే

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేసిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మెయిన్ గా ఈ మార్చ్ నెల మరింత స్పెషల్ గా మారింది. మార్చ్ లోనే రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ నెలంతా వారికి ప్రత్యేకమే.. దీనితో ఈ మార్చ్ నెల మాత్రం రచ్చే అంటున్నారు పెద్ది మేకర్స్ ఈ మార్చ్ 2 న అవైటెడ్ సెకండ్ సింగిల్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక దీనిపై లేటెస్ట్ గా మాస్ పోస్టర్ ని కూడా వదిలి మాస్ ట్రీట్ గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సాంగ్ మొదలు మార్చ్ నెలలో మరిన్ని అప్డేట్స్ ఉండొచ్చు అంతే కాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు మార్చ్ 27న ఓ బిగ్ అప్డేట్ వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో ఈ మార్చ్ నెలంతా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version