ఐరోపా దేశంలో షూటింగ్ జరుపుకోబోతున్న రామ్ చరణ్ సినిమా !

ramcharan Boyapati

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలను అజ‌ర్ బైజాన్‌ అనే దేశంలో తెరకెక్కించనున్నారు. తూర్పు ఐరోపాలోని పెద్ద దేశంగా ఉన్న అజ‌ర్ బైజాన్‌ లో మంచి లొకేష‌న్లు ఉన్నాయట. దాదాపు ముప్పై రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే ఓ మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలిచిపోనుందట.

బోయపాటి సినిమాల శైలిలోనే ఈ సినిమా కూడా పక్కా మాస్ మసాలా అంశాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నేలా బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ చాలా సంవత్సరాల తర్వాత ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version