యాక్షన్ సీక్వెన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్

Published on May 6, 2014 8:27 am IST

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పూర్తి కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం. ఈ షూటింగ్ లో భాగంగా నగర శివార్లలో వేసిన ఓ సెట్ లో రామ్ – లక్షణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు.

ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు రాజ్ కిరణ్, మిత్ర, కాశీ విశ్వనాథ్ తదితర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ కి తాతయ్య పాత్రలో రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. అలాగే శ్రీ కాంత్ చరణ్ కి బాబాయ్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ఓ లాంగ్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం యూరప్ వెళ్లనున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, రామ్ చరణ్ కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందని ఈ చిత్ర టీం అంటోంది.

సంబంధిత సమాచారం :