శంషాబాద్ లో రామ్ చరణ్ సందడి.!

ram-charan
యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కామెడీ స్పెషలిస్ట్ స్రీఉవైత్ల కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో మొదటి సారి రామ్ చరణ్ ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ నుంచి ఆశించే యాక్షన్ ఉంటూనే ఆద్యంతం కామెడీ ఉండేలా శ్రీనువైట్ల ఈ పాత్రని డిజైన్ చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సిటీ అవుట్ స్కర్ట్స్ అయిన శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ అవుట్ డోర్ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు ప్రముఖ నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

ఇప్పటి వరకూ షూట్ చేసిన సీన్స్ మరియు సాంగ్స్ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. రామ్ చరణ్ సరసన మొదటి సారిగా టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బంద, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version