మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ హౌస్ సెట్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సెట్లో ఈ సినిమాకే హైలైట్స్ గా నిలిచే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలాగే ఈ స్పెషల్ సెట్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ హౌస్ సెట్ లో జరుగుతున్నా షెడ్యూల్ లో రెండు పాటలను కూడా షూట్ చేయనున్నారు.
పూర్తి సందడిగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరచిపోలేని సినిమా అవుతుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానతిస్తున్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.


