మిస్టర్ మజ్ను ట్రైలర్ ఫై స్పందించిన రామ్ చరణ్ !

Published on Jan 22, 2019 3:18 pm IST

అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ యొక్క ట్రైలర్ ఇటీవల విడుదలై 6 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ ట్రైలర్ ను వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని అఖిల్ తో పాటు చిత్ర యూనిట్ కు తన పేస్ బుక్ ద్వారా అల్ ది బెస్ట్ తెలియజేశారు.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా తమన్ సంగీతం అందించారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుంది. ఇక ‘అఖిల్ , హలో’ చిత్రాల తో హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు ఈ చిత్రానికి సోలో రిలీజ్ కూడా కలిసిరానుంది. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడోలేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More