నూర్ అహ్మద్ కుటుంబానికి చరణ్ పదిలక్షల ఆర్థిక సాయం.

నూర్ అహ్మద్ కుటుంబానికి చరణ్ పదిలక్షల ఆర్థిక సాయం.

Published on Dec 9, 2019 3:08 PM IST

Ram charan1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో మారు తన పెద్దమనసు చాటుకున్నారు. నూర్ అహ్మద్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆయన ప్రకటించారు. నిన్న గ్రేటర్ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణం పొందిన సంగతి తెలిసిందే. అనేక ఏళ్లుగా మెగా కుటుంబానికి అభిమానిగా ఉన్న నూర్ అహ్మద్ మరణ వార్త మెగా కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. చిరంజీవి, అల్లు అర్జున్ స్వయంగా ఆయన మృత దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో నిన్న ఆయన వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్‌ ఒక ప్రకట చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు.

నూర్‌ ఆహ్మద్‌ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.‘’నూర్‌ అహ్మద్‌ గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు.

తాజా వార్తలు