‘బ్రూస్ లీ – ది ఫైటర్’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిననున్న సినిమా ‘రక్షక్'(వర్కింగ్ టైటిల్). సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ కి రీమేక్. ఈ సినిమా ఫిబ్రవరి 3వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తమిళ వెర్షన లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి ఇందులో కూడా విలన్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా రామ్ చరణ్ మరో రీమేక్ సినిమాపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హిన్దీఎలొ జాన్ అబ్రహం హీరోగా నటించిన సినిమా ‘రాకీ హాన్డ్సం’. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం దీనిని తెలుగు, తమిళంలో కూడా రీమేక్ చేయాలనుకున్నారు. అందులో తెలుగు వెర్షన్ కి రామ్ చరణ్ ని హీరోగా ఎంచుకునే పనిలోఉన్నారట . రామ్ చరణ్ కూడా ఈ సినిమా కథపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి రామ్ చరణ్ చేస్తాడా లేదా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
