వరుణ్ తేజ్ “గని” కోసం రామ్ చరణ్…టీజర్ కి వాయిస్ ఓవర్!

Published on Nov 14, 2021 10:45 pm IST


వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న నేపథ్యం లో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, గని అంతెం సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి పెంచేసింది. ఈ చిత్రం టీజర్ ను రేపు ఉదయం 11:08 విడుదల చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్ కి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండనుంది అని తెలుస్తుంది. ఈ విషయం తెలియడం తో టీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మెగా ప్రిన్స్ తన మేకోవర్ తో ఆకట్టుకోగా, ఇప్పుడు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :