ఆ సినిమా పైనే చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఆధారపడి ఉందా ?

Published on May 31, 2023 2:01 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా భారీ సినిమాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి అందరిలో మంచి హైప్ ఏర్పరిచాయి. అయితే గేమ్ ఛేంజర్ పక్కాగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలానే మూవీ నుండి గ్లింప్స్, టీజర్, సాంగ్స్, వంటి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ లో ఒకింత ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఇటు ఈ మూవీతో పాటు అటు కమల్ తో భారతీయుడు 2 మూవీ కూడా తీస్తున్నారు శంకర్. అయితే వీటిలో భారతీయుడు 2 రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా గేమ్ ఛేంజర్ సమ్మర్ కి రిలీజ్ కానుందనే వార్తలు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా వీటిలో భారతీయుడు మూవీనే ముందుగా రిలీజ్ చేయాలని శంకర్ సహా ఆ మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్, కమల్ నటిస్తున్న భారతీయుడు 2 పై ఒకరకంగా ఆధారపడి ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. మరి చరణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :