అభిమానులకు చరణ్ ఆత్మీయ ఆలింగనం

Published on Jun 25, 2021 11:02 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.ఈ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కకలా ప్రేమను చాటుకుంటూ ఉంటారు. వారు చూపే అభిమానం ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు చరణ్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకొందరు పాదయాత్రలు చేస్తుంటారు. అలాంటి అభిమానులే ముగ్గురు పాదయాత్ర చేసుకుంటూ చరణ్ వద్దకు చేరుకున్నారు. సంధ్య జయరాజ్, రవి, వీరేష్‌లు జోగులాంబ గద్వాల్ నుంచి హైద్రాబాద్ వరకు దాదాపు 231 కి.మీ పాదయాత్ర చేశారు.

ఈ పాదయాత్రను నాలుగు రోజుల నడిచి పూర్తిచేశారు. సదరు ఫ్యాన్స్ పాదయాత్రతో తన ఇంటికి చేరుకున్న సంగతి తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే వారిని కలుసుకున్నారు. సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాసేపు సరదాగా వారితో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రాలను పూర్తిచేసే బిజీలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక వెంటనే శంకర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :