‘పెద్ది’ షూటింగ్ లో గాయపడ్డ రామ్ చరణ్..!

‘పెద్ది’ షూటింగ్ లో గాయపడ్డ రామ్ చరణ్..!

Published on Mar 25, 2026 7:00 AM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చిన్నపాటి గాయమైనట్లు సమాచారం. ఆయన కంటి సమీపంలో గాయం తగిలిందని, అయితే ఇది చాలా స్వల్పమైనది కావడంతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

​ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత తిరిగి సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. మరీ ముఖ్యంగా, ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ చిత్రం నుండి క్రేజీ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

​వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు