పొల్లాచిలో షూట్ చెయ్యనున్న రామ్ చరణ్ – కృష్ణవంశీ ల సినిమా

Published on Dec 18, 2013 9:00 pm IST

Ram-Charan-and-Krishna-Vams
వచ్చే ఏడాది మొదట్లో రామ్ చరణ్ కృష్ణ వంశీ ల సినిమా మొదలుకానుంది. ఇప్పటికే మన క్రియేటివ్ డైరెక్టర్ స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుని దైవ దర్శనానికి వెళ్లి దేవుడి అనుగ్రహం కూడా పొందాడు. ఈ సినిమా బృందంతో కలిసి ప్రస్తుతం కృష్ణవంశీ పొల్లాచి లో లోకేషన్ల వేటకు వెళ్ళాడు.

రామ్ చరణ్ మొదటిసారిగా కృష్ణవంశీతో కలిసి నటిస్తున్నాడు. తమిళ నటుడు రాజ్ కిరణ్(పందెంకోడి నటుడు) ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్లగణేష్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తాడని సమాచారం

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ ఈ జనవరి 12న భారీ విడుదలకు సిద్ధమవుతుంది

సంబంధిత సమాచారం :