2015 నుండి శ్రీను వైట్ల – రామ్ చరణ్ ల చిత్రం

2015 నుండి శ్రీను వైట్ల – రామ్ చరణ్ ల చిత్రం

Published on Dec 3, 2014 8:00 AM IST

ram-charan-srinu-vaitla
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో అటు ఫ్యామిలీ ప్రేక్షకులకు, ఇటు కుటుంబ కధా చిత్రాలకు దగ్గరయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఆ చిత్ర విడుదల తరువాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేసి వచ్చిన చెర్రి త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు

శ్రీను చెప్పిన స్టోరీ లైన్ అటు మెగా స్టార్ కి ఇటు చెర్రీకి బాగా నచ్చినట్టు ప్రస్తుతం దాని మీద పవర్ ఫుల్ స్టోరీని రాసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా 2015లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మిగిలిన తారలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలుపనున్నారు. ఈ సినిమానే కాక చరణ్ గౌతం మీనన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం

తాజా వార్తలు