ఎన్టీఆర్, చరణ్ సినిమాలు ఆలస్యంకాక తప్పదన్నమాట

Published on Feb 6, 2020 10:10 am IST

రాజమౌళి సినిమా అంటే హీరోలు నెలలు కాదు దాదాపు ఒక సంవత్సర కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఆయన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం తారక్, చరణ్ ఇద్దరూ ఒప్పుకోగానే అభిమానులు అంటే ఇంకో యేడాది పాటు మన హీరోల సినిమాలు ఉండవు అనే నిర్ణయానికి వచ్చేశారు. రాజమౌళి సినిమా కాబట్టి అంత ఎక్కువ కాలం ఎదురుచూడొచ్చని అనుకున్నారు. కానీ ఆ చిత్రం విడుదల 2020 నుండి 2021 జనవరి 8కి మారింది.

అంటే సినిమా విడుదలై, ప్రమోషన్లు ముగిసి మన హీరోలు కొంత విశ్రాంతి తీసుకుని కొత్త సినిమా స్టార్ట్ చేసేసరికి 2021 మార్చ్ లేదా ఏప్రిల్ వచ్చేస్తుంది. ఇక ఆ సినిమా పూర్టై, విడుదలకు వచ్చేసరికి 2021 ఆఖరు వచ్చేస్తుంది. ఇది కూడా అన్నీ ప్లాన్ ప్రకారం చకచకా జరిగితేనే.. అలా కాకుండా మధ్యలో ఏవైనా గ్యాప్స్ వస్తే ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కనబడేది 2022 ఆరంభలోనే. ఇదే ఇద్దరు హీరోల అభిమానుల్ని కొంత ఇబ్బంది పెడుతోంది.

సంబంధిత సమాచారం :