మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పూర్తి డిఫరెంట్ లుక్ లో మొదటిసారిగా చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి కృష్ణవంశీ డైరెక్టర్. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇది కాకుండా తాజాగా రామ్ చరణ్ కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి అందించిన కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.
కోన వెంకట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ నేను గోపి మోహన్ కలిసి రామ్ చరణ్ కి కథ చెప్పాము. ఆ కథ తనకి చాలా బాగా నచ్చింది. గతంలో నేను గోపి మోహన్ కలిసి రాసిన ‘రెడీ’, ‘దూకుడు’ సినిమాలో లానే చరణ్ సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ జోనర్ ఫిల్మ్’ అని అన్నాడు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.


