ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఫస్ట్ వీక్ రికార్డు.. నాన్ RRR షేర్ పెట్టిన చరణ్!

ఉత్తరాంధ్రలో ‘పెద్ది’ ఫస్ట్ వీక్ రికార్డు.. నాన్ RRR షేర్ పెట్టిన చరణ్!

Published on Jun 11, 2026 10:28 AM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించి మొదటి వారం రన్ ని పూర్తి చేసుకుంది.

అయితే పెద్ది బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ లెవెల్లో ఉండడం విశేషం. ట్రేడ్ వర్గాలు షాకయ్యే రెవెన్యూ పెద్ది సినిమా అక్కడ జెనరేట్ చేసింది. మాస్ ఏరియాలు మొత్తం పెద్ది మ్యానియానే నడుస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా అక్కడ ఇప్పటికీ టికెట్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ బాగా పెర్ఫామ్ చేయడం విశేషం.

అయితే ఇలా మొదటి వారం రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా పి ఆర్ నంబర్స్ ప్రకారం మొత్తం 18 కోట్లకి పైగా షేర్ ని (జిఎస్టీ) తో కలిపి రాబట్టినట్టు తెలుస్తుంది. ఇది ఉత్తరాంధ్రలో రెండో అతిపెద్ద నెంబర్ అన్నట్టుగా టాక్. సో RRR తర్వాత రామ్ చరణ్ మరోసారి భారీ రెస్పాన్స్ కొల్లగొట్టాడు అని చెప్పొచ్చు.

తాజా వార్తలు