‘పెద్ది’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 4 రోజులు పూర్తి కాకుండానే 250 కోట్ల ప్లస్

‘పెద్ది’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 4 రోజులు పూర్తి కాకుండానే 250 కోట్ల ప్లస్

Published on Jun 7, 2026 11:00 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సాలిడ్ హిట్ చిత్రమే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వీకెండ్ ని చూస్తుంది. అలానే ప్రపంచ వ్యాప్తంగా కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని ఈ సినిమా కనబరచడంతో వరుస భారీ నంబర్స్ సాధ్యం అవుతున్నాయి.

ఇలా మూడు రోజుల్లోనే 230 కోట్లకి పైగా రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు నాలుగో రోజు పూర్తి కాకుండానే 250 కోట్ల మార్క్ ని దాటేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పెద్ది బాక్సాఫీస్ దగ్గర వరుస సిక్సర్ లతో దుమ్ము లేపేస్తున్నాడని చెప్పవచ్చు. దీనితో స్ట్రాంగ్ డే 4 కి మొత్తం 250 కోట్లకి పైగానే ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. సో అధికారిక నంబర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు