‘పెద్ది’ వసూళ్లు 420 కోట్లా.. 450 కోట్లా!?

‘పెద్ది’ వసూళ్లు 420 కోట్లా.. 450 కోట్లా!?

Published on Jun 23, 2026 11:01 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే పెద్ది. ఒక డేరింగ్ సబ్జెక్ట్ ని రామ్ చరణ్ ఎంచుకొని వచ్చి సూపర్ హిట్ కొట్టి క్రేజీ కంబ్యాక్ అందించి మెగా ఫ్యాన్స్ లో కొత్త ఊపు తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400కోట్ల మార్క్ ని దాటినట్టు మేకర్స్ చెప్పారు.

కానీ లేటెస్ట్ గా సినిమా వసూళ్లు బాలీవుడ్ మీడియా వారు 450 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అని బాలీవుడ్ మీడియా చెప్తే ఇవాళ సక్సెస్ ఈవెంట్ లో సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ 420 కోట్లు అంటూ చెప్పారు. దీనితో ఈ సక్సెస్ ఫుల్ సినిమా నెంబర్ గేమ్ విషయంలో ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు.

సో వీటికి క్లారిటీ ఇస్తూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ఏమన్నా వదులుతారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు